వ్యాపారులకు భారీ ఊరట: దిల్లీలో సులభతర వాణిజ్య విధానానికి శ్రీకారం
రిపోర్టర్: హరి
స్థలం: Delhi
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం పలు కీలక సంస్కరణలను అమలు చేస్తోందని లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు తెలిపారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న పనులను నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ ఎత్తివేయడం, తనిఖీలు లేని విద్యుత్ కనెక్షన్లు వంటి నూతన మార్పులతో వాణిజ్య రంగం మరింత సులువు కానుందని అధికారులు వెల్లడించారు.