క్వారీలో విషాదం: ప్లేట్లు కడుగుతూ నీటిలో మునిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం క్వారీలో సరదాగా విహారానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. యాప్రాల్ కు చెందిన ఐదుగురు యువకులు ఆదివారం ఉదయం క్వారీ వద్దకు వెళ్లి వంట చేసుకున్నారు. అనంతరం ప్లేట్లు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి సయాన్, రోహిత్ గల్లంతు కావడంతో పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.