తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. 2029లో కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెస్తామని జడ్పీ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను ధీమా
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని, 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తానని జడ్పీ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను తెలిపారు. మంగళవారం విజయనగరంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు విజన్, లోకేష్ యువగళంతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని, ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.