విజయనగరం టీడీపీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జడ్పీ చైర్మన్ కూతురు సిరి సహస్ర భాగస్వామ్యం

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: విజయనగరం

విజయనగరంలో నిర్వహించిన టీడీపీ ఆత్మీయ సమావేశానికి జడ్పీ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తండ్రి ప్రజాసేవ తనకు స్ఫూర్తి అని, యువత పెద్దఎత్తున టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఆమె రాకతో మహిళా కార్యకర్తలు, యువతలో మరింత జోష్ పెరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.