దుబాయ్లో లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలు చేసిన సూర్యకుమార్ యాదవ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: దుబాయ్

భారత టీ20 మాజీ సారథి సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ నగరంలో ఒక భారీ లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తన భార్య దేవిషా శెట్టితో కలిసి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దుబాయ్లోని షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్లో ఈ నివాసాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇక్కడి అద్భుతమైన భద్రత, జీవన ప్రమాణాలు, ఆధునిక వెల్నెస్ సదుపాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.