'జైలుకు తరలించండి': కారుమూరి నాగేశ్వరరావుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను తక్షణమే జైలుకు తరలించాలంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న అధికారులు, రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నగరానికి చేరుకున్నాక కోర్టు ఆదేశాల మేరకు ఆయనను చంచల్‌గూడ జైలు అధికారులకు అప్పగించనున్నారు.