ముంబైలో ఆందోళనల వేళ నటుడు ఇమ్రాన్ ఖాన్ ముందస్తు అదుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: Mumbai
ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన స్నేహితురాలు లేఖా వాషింగ్టన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో ఆగ్రాంతి మైదాన్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దేశ పౌరుడిగా స్వేచ్ఛా హకాల పరిరక్షణ కోసమే తాను ఈ ఆందోళనలో భాగస్వామ్యమైనట్లు ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.