టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేడియల్ రోడ్ నిర్మాణ కాంట్రాక్టుల కేటాయింపు ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టెండర్ల ప్రక్రియలో పోటీపడవద్దని సీఎం కార్యాలయం నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.