టాలీవుడ్ లో మేధా మేకా ఎంట్రీ: తొలి సినిమా ముందే వరుస అవకాశాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్లోకి నటుడు శ్రీకాంత్, ఊహ దంపతుల కుమార్తె మేధా మేకా అడుగుపెడుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తొలి సినిమా విడుదల కాకముందే ఆమెకు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ కామెడీ చిత్రంతో ఆమె కథానాయకిగా పరిచయం కానున్నారు. పెద్ద బ్యానర్ నుంచి లాంచ్ అవుతుండటంతో పాటు సీక్వెల్ చిత్రాలలో కూడా ఆమె పేరు వినిపిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.