వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తలకు వేధింపులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: కాకినాడ
గత వైకాపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలను తీవ్రంగా వేధించేవారని, కూటమి ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రానికి ఏం చేస్తారనే సంప్రదాయం తెచ్చామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో రూ.4,652 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదిరాయి.