ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఏపీలో కృత్రిమ పన్నీర్పై ఏడాది నిషేధం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ పన్నీర్పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతాశాఖ కమిషనర్ వీరపాండియన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కృత్రిమ పన్నీర్ మరియు నాణ్యత లేని చీజ్ వినియోగిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో తయారీ, విక్రయాలు, నిల్వ, రవాణాపై ఈ నిషేధం అమల్లోకి వస్తుందని వారు స్పష్టం చేశారు.