ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని కొదుమూరి జగన్నాథం గుప్తా హెచ్చరిక
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
అమరవాది లక్ష్మీనారాయణపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొదుమూరి జగన్నాథం గుప్తా స్పష్టం చేశారు. ఆర్యవైశ్య మహాసభ బలోపేతానికి అమరవాది చేసిన కృషిని కొనియాడారు. నిధుల దుర్వినియోగం, డూప్లికేట్ సభ్యత్వాల ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, వ్యక్తిగత విమర్శలతో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని ఆయన హితవు పలికారు.