రేపల్లెలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి సర్కార్ భారీ నిధులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: బాపట్ల
రేపల్లె నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే ఆనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకొత్త చొరవతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి యాభై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల నిధులతో పాటు అరవై ఆరు నూతన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు.