దారుణం: భార్యను నరికి కాళీ ఆలయంలో తెగిన తలతో కూర్చున్న భర్త
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: South Dinajpur
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటనలో భార్యను దారుణంగా హత్య చేసిన రింటు ఘోష్ అనే వ్యక్తి, ఆమె తెగిన తలను తన ఒళ్ లో ఉంచుకుని కాళీ ఆలయంలో కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని ఇద్దరు కుమారులను రక్షించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.