ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ ధ్వజం: బీజేపీకి తొత్తుగా మారారని ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా పార్లమెంట్ వీధుల్లో ఇండియా కూటమి తలపెట్టిన మార్చ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను అధికార పార్టీ అణచివేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.