నకిలీ సర్టిఫికెట్ల సమర్పణ అభ్యర్థి వ్యక్తిగత మోసమే
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించడం అభ్యర్థి చేసిన వ్యక్తిగత మోసమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వ తప్పిదంగా చిత్రీకరించి రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించడం సరికాదన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిని రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారంగా మార్చడం వల్ల నిజాయితీగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.