వైకాపా అరాచకాలను సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తోటపల్లిగూడూరు
తప్పులు లేని భూరికార్డులందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తోటపల్లిగూడూరులో 741 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. గత వైకాపా హయాంలో ఆస్తుల పుస్తకాలు, హద్దు రాళ్లపై సైతం జగన్ ఫొటోలు ముద్రించుకుని దుర్మార్గాలకు పాల్పడ్డారని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఆ విధానాలన్నింటికీ స్వస్తి పలికి రీసర్వే తప్పులను సరిదిద్దుతున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోరుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.