ప్యారడైజ్ సినిమాను ప్రేక్షకులతో చూసేందుకు అనుమతించాలని నాని విజ్ఞప్తి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లో సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించేందుకు ప్రత్యేక అనుమతివ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఎక్స్ వేదికగా నాని అభ్యర్థించారు.