న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నటి రూపాలీ గంగూలీ: ఏఐ మార్ఫింగ్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: ముంబై

తన అనుమతి లేకుండా ఫోటోలు, మార్ఫ్ చేసిన ఏఐ వీడియోలను వాడుతున్న కొన్ని ఆన్ లైన్ వేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బాంబే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆమె తరఫు న్యాయవాది సనా ఖాన్ తెలిపారు. తన పేరు, ఇమేజ్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరినట్లు వార్తలు వస్తున్నాయి.