రామ్టెక్ ఎంపీ శ్యామ్కుమార్ బర్వే చెంపదెబ్బ వివాదంపై ప్రతిభ ధనోర్కర్ స్పష్టత

రిపోర్టర్: నరేష్ స్థలం: Nagpur

తాను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి ఎంపీ శ్యామ్కుమార్ బర్వే తనను సరదాగా కొట్టారని, అది కేవలం స్నేహపూర్వక సంభాషణ మాత్రమేనని చంద్రపూర్ ఎంపీ ప్రతిభ ధనోర్కర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీకి వెళ్తున్న సమయంలో ఈ సరదా సంఘటన చోటుచేసుకుందని, కొందరు కావాలనే దీనిని రాద్ధాంతం చేస్తున్నారని ధనోర్కర్ పేర్కొన్నారు.