ఉత్తర్ ప్రదేశ్ లో మైనర్ బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారం
రిపోర్టర్: శివ
స్థలం: Uttar Pradesh
ఉత్తర్ ప్రదేశ్ లోని బలరాంపూర్ కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికకు లిఫ్ట్ ఇచ్చి లారీ డ్రైవర్, క్లీనర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబంతో గొడవపడి ఇంటి నుంచి వచ్చిన బాలికను బస్తీ వెళ్తానని నమ్మించి లారీ ఎక్కించుకున్నారు. ప్రయాణ సమయంలో దారుణానికి పాల్పడగా, సోమవారం ఉదయం దేరియా జిల్లా సలేంపూర్ వద్ద లారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.