బీజేపీ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల నియామకం డీకే అరుణకు తమిళనాడు సహ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు, సహ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీకి చెందిన ప్రముఖ నేత దగ్గుబాటి పురందేశ్వరిని ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లును కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌గా ఎంపిక చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను అధిష్టానం కొనసాగించింది.