విశాఖ తీర అభివృద్ధికి సీఆర్ జడ్ కేటగిరీల మార్పునకు సన్నాహాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం తీర ప్రాంతంలో అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారిన తీర నియంత్రణ ప్రాంతం సీఆర్ జడ్ నిబంధనలను సడలించేందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సన్నాహాలు చేపట్టింది. విశాఖ గ్రామీణం, భీమిలి, పెదగంట్యాడ, పరవాడ మండలాల్లో సీఆర్ జడ్ కేటగిరీలను మార్చాలని భావిస్తుండగా, దీనిపై ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.