కవ్వాల్ అభయారణ్యం.. వన్యప్రాణులకు జీవనాడి!

రిపోర్టర్: p.g. murthy స్థలం: జన్నారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణులకు మణిహారంలా నిలుస్తోంది. అటవీ సంపదను, అరుదైన జీవజాలాన్ని పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రజల్లో నిరంతరం చైతన్యం తీసుకువస్తున్నారు.

పులులు, జింకలు, మనుబోతులు, పలు రకాల పశుపక్షాదులకు ఈ అభయారణ్యం ఆవాసంగా ఉంది. నూతన జీవజాల గుర్తింపు కోసం జంతు శాస్త్రవేత్తలు అడవిలో ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నారు.