ప్రముఖ రష్యన్ పండితురాలు లూడ్మిలా ఖోఖ్లావాకు పద్మశ్రీ పురస్కారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
భారతీయ భాషలు మరియు సాహిత్య అధ్యయనంలో విశేష కృషి చేసిన రష్యన్ పండితురాలు డాక్టర్ లూడ్మిలా ఖోఖ్లావాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం లభించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేశారు. ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ భాషలపై పరిశోధనలు చేస్తూ, రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులకు హిందీ, పంజాబీ భాషలను బోధిస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కింది.