మధుమేహ బాధితులకు తీపి కబురు: ఎండలో తిరిగితే రక్తంలో చక్కెర స్థాయిలు డౌన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
శరీర జీవక్రియలు మెరుగుపడటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉందని జర్మన్ డయాబెటిస్ సెంటర్ శాస్త్రవేత్త పాట్రిక్ ష్రౌవెన్ వెల్లడించారు. సహజమైన పగటి వెలుతురులో గడిపిన టైప్-2 డయాబెటిస్ బాధితుల్ లో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిధిలో ఉన్నట్లు పరిశోధనలో తేలిందని తెలిపారు. శీతాకాలంలో సూర్యరశ్మి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని, ఆహారం, వ్యాయామంతో పాటు సహజమైన వెలుతురు కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.