సీఎస్కే తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఉండాలి: సదగోపన్ రమేష్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ఐపీఎల్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో నాయకత్వ మార్పు తప్పనిసరి అని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, జట్టు పగ్గాలను సంజూ శాంసన్‌కు అప్పగించాలని ఆయన సూచించారు. శాంసన్ అద్భుతమైన టీమ్ ప్లేయర్ అని, అతను జట్టును సమర్థవంతంగా నడిపించగలడని రమేష్ అభిప్రాయపడ్డారు.