తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.