పీఠాపురంలో వినతుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న జనసేన పార్టీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పిఠాపురం
పిఠాపురం పర్యటనలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ప్రజల నుంచి అందిన వివిధ వినతులకు తక్షణ పరిష్కారం లభించిందని జనసేన పార్టీ వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొంది. ఈ మేరకు అధికారిక ఎక్స్ వేదికగా వివరాలను పంచుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అర్జీలను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.