స్థానిక ఎన్నికలలో గెలుపే మన ధ్యేయమన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులంతా ఐక్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.