శాసనమండలి పట్టభద్రుల స్థానాలకు కాంగ్రెస్ అభ్య్రర్థుల ఖరారు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనమండలికి జరగనున్న పట్టభద్రుల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసినట్లు ఏఐసీసీ వెల్లడించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.