బిగ్ బాస్ వేదికపై విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై వివాదం.
రిపోర్టర్: సునీల్
స్థలం: తమిళనాడు
తమిళనాడులో బిగ్ బాస్ షోలో విజయ్ సేతుపతి చేసిన రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎన్నికల హామీలపై ఆయన చేసిన కామెంట్లు టీవీకే అధినేత విజయ్ను ఉద్దేశించేనని అభిమానులు మండిపడ్డారు. ఈ వివాదంపై స్పందించిన విజయ్ టీవీ యాజమాన్యం, షోలోని సంభాషణలను బయటి రాజకీయాలతో ముడిపెట్టవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది.