వైద్య రంగంలో సంచలనం: ఏడు నిమిషాల ఎండోస్కోపీతో క్యాన్సర్ గుర్తింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
క్యాన్సర్ నిరోధక చర్యల్లో భాగంగా కనీసం ఏడు నిమిషాల పాటు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహిస్తే కడుపులో కణితులు సులభంగా బయటపడతాయని ఎయిమ్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రమోద్ గర్గ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ గ్యాస్ట్రోఎంటరాలజీ కాంగ్రెస్ సదస్సులో ఆయన ఈ కీలక విషయాలను స్పష్టం చేశారు. నాణ్యమైన పరీక్షల ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చని ఆయన తెలిపారు.