ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు, ఉత్తర్వులు జారీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఏడాది కాలపరిమితితో దుకాణాల లైసెన్సులు పునరుద్ధరించనున్నారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంలో, తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు నిషేధించారు. శనివారం నుంచి ఈనెల 21 వరకు రెన్యువల్‌కు అవకాశం కల్పించగా, 30న లక్కీ డ్రా ద్వారా కొత్త దరఖాస్తుల కేటాయింపు జరుగనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.