దుర్భర స్థితిలో గాంధీసాగరం జలాశయం.. ఆక్రమణలపాలు!

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయనగరం

గుర్ల మండలంలోని గాంధీసాగరం జలాశయం దశాబ్దాలుగా నిర్వహణ లేక పూడికతో నిండిపోయి మెరక ప్రాంతంగా మారింది. చుక్కనీరు అందక ఆయకట్టు ఎండిపోతుంటే, మరోవైపు జలాశయ గర్భం ఆక్రమణలకు గురై ఏకంగా తోటలు వేశారు. నీటిపారుదల శాఖ విస్మరించడంతో 500 ఎకరాల సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పూడికతీతకు నిధులు మంజూరైనా పనులు జరగలేదు.