బాలాపూర్లో అత్యంత వైభవంగా ప్రారంభమైన 47వ గణేశ్ శోభాయాత్ర
రిపోర్టర్: సురేష్
స్థలం: బాలాపూర్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో 47వ గణేశ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య నిమజ్జన ఊరేగింపు మొదలైంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని సాగనంపేందుకు భక్తులు ఉత్సాహంగా ఊరేగింపులో భాగస్వాములయ్యారు.