దొంగల నుంచి కాపాడుకునేందుకు ఇంటి పైకి ఎక్కించిన కారు!

రిపోర్టర్: మహేష్ స్థలం: బీహార్

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఓ వ్యక్తి కొత్త ఎస్‌యూవీ కారును దొంగల నుంచి కాపాడుకునేందుకు వింత సాహసం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మనోజ్ యాదవ్ కుటుంబ సభ్యులు, కారు భద్రత కోసం భారీ క్రేన్ సహాయంతో రెండు అంతస్తుల ఇల్లు పైకప్పు మీదకు ఎక్కించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.