గురుగ్రామ్ లో మహీంద్రా థార్ సీజ్: నిబంధనలు ఉల్లంఘించినందుకు వాహనం జప్తు
రిపోర్టర్: రమేష్
స్థలం: గురుగ్రామ్
గురుగ్రామ్ లో నంబర్ ప్లేట్ లేకపోవడం, బ్లాక్ ఫిలిం వినియోగం వంటి పలు నిబంధనలు ఉల్లంఘించినందుకు మహీంద్రా థార్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఈ ఉల్లంఘనలు గుర్తించి వాహనాన్ని సీజ్ చేశామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.