ఫేక్ న్యూస్పై సీపీ సజ్జనార్ సీరియస్: ఏఐ డీప్ఫేక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

దేవర చిత్రంలోని చుట్టమల్లె పాట మార్ఫింగ్ వీడియోపై వస్తున్న ఫేక్ న్యూస్పై హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు, డీప్ఫేక్లను చూసి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఎలాంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని స్పష్టం చేశారు. ఆన్లైన్లో చూసే ప్రతి విషయాన్ని ప్రశ్నించి నిజానిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.