ఖజాగూడ హిట్ అండ్ రన్: నిందితుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ ఖజాగూడలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో నిందితుడు శివ సందీప్ సాయి ఆనంద్ డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని రాయదుర్గం పోలీసులు ఆర్టీఏకు లేఖ రాశారు. ఆగస్టు 31న నంబర్ ప్లేట్ లేని కారుతో యువకుడి మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిందితుడిపై కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.