అధికారుల నిర్లక్ష్యంతో పెదగంట్యాడలో మునిగిన లోతట్టు కాలనీలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలో అధికారుల ఉదాసీనత కారణంగా భారీ వర్షాలకు పలు లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయి. పెద్ద గెడ్డకు అడ్డంగా సిమెంటు గొట్టాలతో దారి ఏర్పాటు చేయడంతో వరద నీరు నిలిచిపోయి ముప్పు ఏర్పడింది. ప్రజా సమస్యలపై పత్రికల్లో కథనాలు వచ్చినా స్పందించని అధికారులు, ప్రజలు ఇబ్బంది పడిన తర్వాత గురువారం రంగంలోకి దిగి జేసీబీ సాయంతో పైపులను తొలగించి నీటి మళ్లింపునకు చర్యలు చేపట్టారు.