వంటగదిలో చేసే ఈ పొరపాట్లు క్యాన్సర్కు దారితీస్తాయని నిపుణుల హెచ్చరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

మనం వంటగదిలో చేసే కొన్ని పొరపాట్లు శరీరంలో ప్రమాదకర రసాయనాలు చేరడానికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్-స్టిక్ పాత్రలు వాడటం, పదేపదే నూనెను మరగబెట్టడం, ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి ఆహారం ఉంచడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఎన్ఎల్ఎం అధ్యయనం పేర్కొంది. ఈ ప్రమాదకరమైన అలవాట్లను మానుకుని గాజు లేదా స్టీల్ పాత్రలను ఉపయోగించడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.