ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో సాయికిరణ్ యాదవ్ అంటూ ప్రచారం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దానం నాగేందర్ అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను బరిలో దింపేందుకు సిద్ధం కావాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.