యాదాద్రి జిల్లాలో రైలులో మంటలు: తప్పుకున్న ఘోర ప్రమాదం
రిపోర్టర్: సతీష్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని రైల్వే అధికారులు తెలిపారు. కో-పైలట్ సకాలంలో మంటలను గమనించి లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలును అత్యవసరంగా నిలిపివేశారని, దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. బ్రేక్ లైనర్ల మధ్య రాపిడి జరగడం వల్లే ఈ పొగలు వచ్చాయని ప్రాథమిక విచారణలో తేలింది.