భారీ షాక్: భారత్ తో వన్డేకు దూరమైన న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆక్లాండ్

భారత్ తో ఐదు వన్డేల సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్స్రీతో జరిగిన ఢీకొనే ప్రమాదంలో ఓపెనర్ డెవాన్ కాన్వే గాయపడ్డారని అధికారులు తెలిపారు. తలకు బలమైన గాయం కావడంతో బుధవారం భారత్ తో జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కు ఆయన దూరమయ్యారని వైద్య బృందం స్పష్టం చేసింది.