స్థానిక ఎన్నికల్లో సీటు కేటాయించాలని కోరిన జనసేన నేత

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గాజువాక హుడా కాలనీలోని భాగ్యశ్రీ కళ్యాణ మండపంలో జరిగిన స్థానిక ఎన్నికల సమావేశంలో జనసేన సీనియర్ నాయకులు దాసరి త్రినాథరావు పార్టీ పెద్దలను కోరారు. 2009 నుండి పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్నానని, గత జీవీఎంసీ ఎన్నికల్లో త్యాగం చేసినందున ఈసారి 102వ వార్డు కార్పొరేటర్ సీటును తనకు లేదా తన సతీమణికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.