మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: ఏసీపీ ప్రకాష్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ జన్నారం పోలీస్‌స్టేషన్‌లో మద్యం దుకాణాల యజమానులతో సమావేశమయ్యారు. మైనర్లకు మద్యం విక్రయించరాదని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే దుకాణాలు మూసివేయాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి దుకాణంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని సూచించారు. అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని యజమానులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.