టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్.. తిరుపతి నేతల కీలక భేటీ
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమక్షంలో భవిష్యత్తు కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, సత్యవేడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యే అంశాలపై నేతలు చర్చించారు.