విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ ఎదుట దంపతులు వాసు మరియు వెంకటగీత శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బంగారం మరియు ఆస్తుల వివాదంలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, పృథ్వీరాజ్ ఒత్తిడి, వేధింపులే కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.