సమ్మతితో కూడిన బంధాన్ని అత్యాచారమనలేం: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

పరస్పర సమ్మతితో సాగిన బంధం విఫలమైన తర్వాత దానిని అత్యాచారంగా మార్చలేమని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళకు చెందిన సంతోష్ కుమార్ పై నమోదైన అత్యాచారం కేసును కొట్టివేస్తూ, బంధం చక్కగా సాగుతున్నప్పుడు ఇద్దరి అంగీకారంతో జరిగిన సాన్నిహిత్యాన్ని ఆ తర్వాత తెగిపోయిందనే కారణంతో నేరంగా పరిగణించడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.